TG: పార్లమెంట్ సమావేశాల్లో దేశ భద్రతపై చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏంచేస్తోందని, SIR పేరిట ప్రజల ఓటుహక్కును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో శాశ్వతంగా ఉండాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని మండిపడ్డారు. సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, డెమోక్రసీపై చర్చ జరగాలన్నారు.