బాపట్ల: ‘దిత్వా’ తుఫాను ముప్పు నేపథ్యంలో బాపట్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్డీవో గ్లోరియా, డీఎస్పీ రామాంజనేయులు సోమవారం అప్పికట్ల వద్ద నల్లమడ డ్రైన్‌ను పరిశీలించారు. కాలువల్లో నీటి పారుదల సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ఆదేశించారు.