SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లే భక్తులు ముందుగా శ్రీ రాజరాజేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సోమవారం ఏకాదశి కావడంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోడె మొక్కలు చెల్లించుకున్నారు.