E.G: పెరవలి మండలం తీపర్రు గ్రామంలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల అభ్యున్నతికి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.