VZM: విజయనగరం మండలం ద్వారపూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పింఛను మొత్తం అందజేశారు. ఈ మేరకు వారి కుటుంబ యోగక్షేమాలు, ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.