TG: నల్లగొండ జిల్లా బంగారిగడ్డ గ్రామ సర్పంచ్ పదవికి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. దీంతో వారి మధ్య వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి గ్రామాభివృద్ధికి రూ.73 లక్షలు ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిధులు గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించారు.