లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాల అస్త్రం ప్రయోగించారు. ముఖ్యంగా ‘SIR’ (ఓటర్ల జాబితా సవరణ) అంశంపై చర్చ జరగాల్సిందేనంటూ ఎంపీ మాణిక్కం ఠాగూర్ నోటీసు ఇచ్చారు. జీరో అవర్ రద్దు చేసి, మిగతా పనులన్నీ పక్కనపెట్టి దీనిపైనే చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. సభలో దీనిపై తక్షణం చర్చకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను డిమాండ్ చేశారు.