HYD: రీజినల్ రింగ్ రోడ్ పనులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 6 లేన్ రోడ్ నిర్మాణంలో భాగంగా దాదాపు 161 కిలోమీటర్ల పనులకు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్ణయించారు. గతంలో నాలుగు లైన్లను నిర్మించాలని నిర్ణయించగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా 6 లైన్స్ నిర్మించాలని కోరింది.