ప్రకాశం: తుఫాన్ దృష్ట్యా ఒంగోలు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే)ను రద్దు చేశారు. ఈ మేరకు కలెక్టర్ పి. రాజాబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎవరూ ఒంగోలుకు రావద్దని సూచించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.