HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 ఫుట్ బాల్ స్టేడియాలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. రెడ్ హిల్స్, కాప్రా, మల్లేపల్లిలో ఈ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీనికోసం రూ. 15 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది.