విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులో రాష్ట్ర పార్టీ కమిటీ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ సీతమ్మరాజు సుధాకర్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సోమవారం ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మైలపిల్లి శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జ్ దానేష్, బూత్ కన్వీనర్లు సాయి బలరాం, చందర్రావు, రహంతుల్లా, రాజారావు పాల్గొన్నారు.