BPT: బాపట్ల మున్సిపాలిటీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం తెల్లవారుజామునే సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగదు అందజేశారు. 32వ వార్డు హయ్యర్ నగర్లో కమిషనర్ జి.రఘునాథ రెడ్డి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన నూరు శాతం పంపిణీ పూర్తి చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.