భారత్‌తో ఆదివారం ఆసియా కప్ ఫైనల్ ఆడనున్న నేపథ్యంలో.. పాక్ జట్టు ముందుగా తమ మైండ్ సెట్ మార్చుకోవాలని షోయబ్ అక్తర్ సూచించాడు. 20 ఓవర్లు వేయడానికి కాకుండా వికెట్లు తీయడానికి ప్రయత్నించాలన్నాడు. ఇక తొలి 2 ఓవర్లలోనే అభిషేక్‌ని ఔట్ చేస్తే భారత్ ఇబ్బంది పడుతుందని, ఒకవేళ అతను నిలదొక్కుకుంటే కప్ చేజారిపోతుందని హెచ్చరించాడు.