AP: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేసినవారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటని విమర్శించారు. చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలు చేసినా ఖండించలేని స్థితిలో జనసేన సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. జగన్పై వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.