HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీలు సమయాత్తమవుతున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి సునీత పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఆమె గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన చేసింది.