TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. కాగా, మాగంటి గోపీనాథ్ మృతితో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు ఈ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.