భారత్ వేదికగా రేపటి నుంచి జరగనున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నీ నుంచి పాక్ వైదొలిగింది. పహల్గాం దాడి నేపథ్యంలో తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా వారిని భారత్కు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ దేశ పారాలింపిక్ కమిటీ సెక్రటరీ ఇమ్రాన్ షమీ తెలిపాడు. పాక్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.