AP: అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీలో 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాల్లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంపై కమిటీ వేస్తామని చెప్పారు. వంద రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.