SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్ట్‌లో 2,429 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు సంబంధిత ఏఈ శ్రీ వర్ధన్ రెడ్డి శనివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1493 ఫీట్లు కాగా, ప్రస్తుతం 1493.67 ఫీట్లకు నీటిమట్టం చేరింది. దింతో అలుగు ద్వారా 2319 క్యూసెక్కులు, కుడి, ఎడమ పంట సాగు కాలువల 110 క్యూసెక్కులు ఔట్ ఫ్లో కొనసాగుతున్నదని అధికారి తెలిపారు.