E.G: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC), గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సహకారంతో నల్లజర్లలోని జడ్పీ హైస్కూల్, జూనియర్ కళాశాల వద్ద అక్టోబర్ 10న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 20 కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో 1200 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.