KKD: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్య ప్రభ విజయవాడలో మంత్రి నారా లోకేష్‌ని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గంలో ఉన్నత విద్యా సౌకర్యాల అవసరాన్ని వివరించారు. నియోజకవర్గంలో డిగ్రీ, జూనియర్ కాలేజీలు లేనందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని ఏర్పాటు చేయాలని కోరారు.