AP: వైసీపీ MLC వరుదు కళ్యాణి విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. ‘YCP మేనిఫెస్టో అమలు చేయలేదనే.. మాకు అధికారం ఇచ్చారు. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఏ శాఖ రిప్యూ చేసినా అప్పులు తప్ప ఏమీ కనిపించలేదు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం’ అని పేర్కొన్నారు.