BDK: బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ పంచాయతీ బత్తుల నగర గ్రామంలో వర్షాలకు భారీగా గుంతలు పడిన రోడ్డును గ్రామస్తులు సొంత ఖర్చులతో మరమ్మతులు శుక్రవారం చేయించుకున్నారు. దీంతో ఈ రోడ్లపై వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తొలగినట్లు అయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో స్వయంగా గ్రామస్తులే రంగంలోకి దిగినట్లు యూత్ నాయకులు గోవింద్ తెలిపారు.