గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అసెంబ్లీలో శుక్రవారం మాట్లాడుతూ.. ఏపీ ఏర్పడిన తర్వాత పాత వక్ఫ్ బోర్డును ఏపీ-తెలంగాణ బోర్డుగా మార్చారని తెలిపారు. ఆయన హైదరాబాద్లోని హజ్ హౌస్ వంటి వాణిజ్య స్థలాలకు హజ్ కమిటీ రూ. 23 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీకి రావాల్సిన రూ. 63 కోట్ల బకాయిలను విడుదల చేయాలన్నారు.