VZM: శ్రీ పైడితల్లమ్మ పండగ సందర్భంగా 6 ప్రాంతాల్లో, విజయనగరం ఉత్సవాల సందర్భంగా 15 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని DMHO జీవనరాణి శుక్రవారం తెలిపారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో మూడు షిప్టులలో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రథమ చికిత్స వైద్య శిబిరాల సేవలను ప్రజలు, భక్తులు వినియోగించుకోవాలన్నారు.