ELR: గిరిజన సంక్షేమ కమిటీ సభ్యులుగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియమితులయ్యారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఎప్పటికప్పుడు కృషి చేస్తూ వస్తున్నారు. ఈ నియామకం ద్వారా గిరిజనుల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. గిరిజన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానన్నారు.