ELR: కైకలూరు టౌన్ ఎస్సై వెంకట్ కుమార్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ విస్తృత భద్రత తనిఖీలను శనివారం నిర్వహించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్యామలంబ అమ్మవారి ఆలయ పరిసర దేవాలయాలు, లాడ్జిలు, సినిమా థియేటర్లు తనిఖీలు నిర్వహించామన్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు గమనించిన వెంటనే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.