ADB: జిల్లాలోని జూనియర్ కళాశాలలకు ఈనెల 27 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నట్లు DIEO జాధవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ముందుగా ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల కాగా, ప్రస్తుతం ఒక రోజు ముందు నుంచే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.