AP: మౌలికవసతులు, విద్యుదుత్పత్తి, పరిశ్రమలకు ప్రత్యేక మ్యాప్ తయారుచేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోర్టులు, హార్బర్ల మధ్య రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించామని అన్నారు. తమ ప్రభుత్వం రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడదని స్పష్టం చేశారు. స్థానిక భూములు, ట్రాఫిక్ పరిస్థితులు చూసి రోడ్డు వేస్తామన్నారు. హైవేల విషయంలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామని వెల్లడించారు.