TPT: శ్రీవారి గొడుగులతో పాదయాత్రగా తిరుమలకు వెళుతున్న భక్తులకు అన్నదానం చేయడం తన భాగ్యమని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. ఈ మేరకు శ్రీవారి గొడుగులు శుక్రవారం మధ్యాహ్నం పిచ్చాటూరుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కళ్యాణ మండపంలో భక్తులకు అన్నదానం ప్రారంభించారు. అనంతరం శ్రీవారి గొడుగులు పిచ్చాటూరు, నారాయణవనం మీదుగా తిరుమలకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు.