ELR: వృద్ధ దంపతులపై దాడి చేసి ఆభరణాలను దొచుకెళ్లిన దుండగులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ నెల 23న జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ స్టేషన్ ఫరిదిలో పాత నేరస్తుడు దేవర శ్రీరామమూర్తి, మరొ నలుగురుతో దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకొని 246 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నాడని ఎస్పీ కిషోర్ తెలిపారు.