NTR: గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం పర్యవేక్షించారు. ఈనెల 27న బాలకృష్ణ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.