ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అనాధ పిల్లలు, కోవిడ్ పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ లతో కలెక్టర్ రాజర్షి షా సమావేశమయ్యారు. విద్య,ఆరోగ్యం,వారి సమస్యలు తదితర అంశాలపై పిల్లలతో చర్చించారు. అనంతరం పిల్లలతో కలిసి జిల్లా కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.