TG: పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తివేతతో జియాగూడ, పూరానాపూల్, గోల్నాక, మూసారంబాగ్ ముంపు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. దీంతో ఆ ప్రాంత వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జియాగూడ, 100ఫీట్ రోడ్, పురానాపూల్, హైకోర్టు, ఛాదర్ ఘాట్ మార్గంలో రోడ్డుపైకి నీరు చేరింది.