MDK: పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ పరిశీలించారు. మంజూరైన ఇండ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న పురోగతిని సంబంధిత హౌసింగ్ ఏఈని అడిగి తెలుసుకున్నారు.