VZM: పరిసరాల పరిశుభ్రతకు ప్రజల సహకరించాలని కాలంరాజుపేట గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు కోరారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని కాలంరాజుపేట శివారు డోలపాలెం గ్రామాల్లో సర్పంచ్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. ప్రజలు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.