KRNL: ఆదోనిలో ఐసీడీఎస్ సీడీపీవో డిల్లీశ్వరి ఆధ్వర్యంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆదోని ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడీపీవో డిల్లీశ్వరి మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, 0 – 5 సంవత్సరాలలోపు పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించమే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు.