AP: బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయనకు ఎందుకంత అహంభావం అని మండిపడ్డారు. మాజీ CM అంటే వాళ్లకు గౌరవం లేదన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై వాళ్ల నుంచి ఇంతవరకు స్పందన లేదన్నారు. మాజీ CM, ఒక సినీ ప్రముఖుడిని అవమానించడం సరికాదన్నారు. చిరంజీవిని విమర్శిస్తే.. జనసేన స్పందించకపోవడం వారి విజ్ఞతకై వదిలేస్తున్నానన్నారు.