TG: మెట్రో విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. L&T సంస్థ ఎందుకు వెళ్లిపోయిందో.. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తాము అదికారంలో ఉన్నప్పుడే ఎయిర్ పోర్టు మెట్రోకు కూడా శంకుస్థాపన చేశామన్నారు. 400 కి.మీ మేర మెట్రో విస్తరణకు కేసీఆర్ ప్రణాళికలు రచించారన్నారు.