NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవి శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఈవో శ్రీనివాసులురెడ్డి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.