PPM: పార్వతీపురం – డొంకినవలస మధ్య కొత్తగా వేసిన మూడవ లైనులో స్పీడ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ బ్రిజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. శుక్రవారం పార్వతీపురం రైల్వే స్టేషన్లో నిర్వహించిన ట్రయల్ రన్, అమృత భారత్ పనులు పరిశీలించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఇది వాల్తేరు డివిజన్‌కు మరో మైలురాయిగా, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.