NDL: వాతావరణ మార్పుల దృష్ట్యా తుఫానులు, భారీ వర్షాలు ఎదురయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్లో వాతావరణ మార్పులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.