WGL: జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆలయంలోకి అకస్మాత్తుగా పాము రావడంతో భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మొదట భద్రకాళి గుడిలో కనిపించిన నాగుపాము, ఆపై గణపతి ఆలయం వైపు వెళ్లిందని భక్తులు తెలిపారు. వెంటనే విషయాన్ని అధికారులకు తెలపగా.. ఆలయ సిబ్బందిలో ఒకరైన నాగరాజు చాకచక్యంగా పామును పట్టుకున్నారు.