W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఇళ్ల వద్ద పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించడం వల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని, తద్వారా విషజ్వరాల బారిన పడకుండా గ్రామాన్ని కాపాడుకోవచ్చని వారు సూచించారు.