కృష్ణా: అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవిని కించపరుస్తూ, జగన్ని సైకో అని హేళనగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి ప్రకటన ద్వారా ఖండించడాన్ని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కాళీ శుక్రవారం స్వాగతించారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకొని వెళ్లి డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు నష్టం జరగకుండా చూసిన వ్యక్తి చిరంజీవి అని తెలిపారు.