SRD: దివ్యాంగ మహిళలు స్వశక్తితో ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని మహిళా దివ్యాంగ మహిళ శిక్షణ కేంద్రంలో అవగాహన సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉచితంగా న్యాయసహాయం అందిస్తామని చెప్పారు. పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.