KDP: ఆకుపచ్చ రంగు చీరలతో మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. వీరుతో పాటు మంత్రి సవిత కూడా ఉన్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి రోజువారి అలంకరణలో భాగంగా రోజుకో రంగు దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లాలనే నిర్ణయం మేరకు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ సందర్భంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించారు. కాగా, అసెంబ్లీకి వెళ్ళిన వారిలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఉన్నారు.