KRNL: పెద్దకడబూరు మండలం వివిధ గ్రామాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ గీతా ప్రియదర్శిని ఆదేశించారు. శుక్రవారం స్తానిక తహసీల్దార్ ఆఫీసులో రేషన్ డీలర్లు, సచివాలయ సిబ్బందితో స్మార్ట్ కార్డుల పంపిణీపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ గ్రామాలలోని కార్డుదారులకు ఎటువంటి రుసుము లెకుండా ఉచితంగా అందజేయాలన్నారు.