SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి, తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.