భారత్-అమెరికాలకు మేలు జరిగేలా, సాధ్యమైనంత త్వరగా వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. వాణిజ్య సమస్యలపై చర్చల కోసం ఇప్పటికే కేంద్రమంత్రి పియూశ్ గోయల్ బృందం అమెరికాలో పర్యటిస్తున్నట్లు చెప్పింది. ఈ చర్చలు ఫలప్రదమై త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది.